నవగీతం,ఆదిలాబాద్:
ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం తాగునీటి సరఫరా, మన బడి – మన నీరు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా మహిళా శక్తి వంటి పలు అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షిషా సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసారు.ఈ సమీక్ష సమావేశం లో డీఆర్‌డీఓ రవీందర్, డీపీఓ రమేష్, పీడీ హౌసింగ్ షాకీర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ చంద్రమోహన్, ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఎంలు, ఆర్‌డబ్ల్యూఎస్, హౌసింగ్ శాఖల ఇంజనీరింగ్, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.