navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 11:53 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.

సర్పంచ్ మామిడి రాజు

నవగీతం, ఇల్లంతకుంట

గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేవని సర్పంచ్ మామిడి రాజు అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామపంచాయతీ సిబ్బందికి నిత్యవసర సరుకులు, ఆర్థిక సాయం అందజేసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రత కోసం పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు కఠిన పరిస్థితుల్లో శ్రమిస్తున్నారని, పారిశుధ్య కార్మికులు నడిచే దేవుళ్లని కొనియాడారు. మన అందరి ఆరోగ్య బాధ్యతలు వారే మోస్తున్నారన్నారు. పరిశుభ్రతకు మనవంతు సహకారం అందిస్తేనే వారి కష్టాన్ని కొంతైనా తగ్గించగలిగిన వారమవుతామన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా నిర్దేశించిన ప్రదేశాల్లోనే చెత్త ఉంచాలని, అలాగే ఇళ్లలోని చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి గ్రామపంచాయతీ వాహనాలకు అందజేయాలన్నారు. మన ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామస్తులు ఆలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూగు నాగరాజు , వార్డు సభ్యులు చేరాల వంశీ, రేగుల కార్తీక్, మామిడి శ్రీనివాస్, మామిడి సుశీల, రాకం సుమన్, కూనబోయిన రఘు, నాయకులు కొట్టే వెంకన్న ,దేవయ్య, మహేష్, రవితేజ, రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు