navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 12:05 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పెంపుడు కుక్కకు ‘నిలువెత్తు బంగారం’

శ్రీమాత డెవలపర్స్ చైర్మన్ వినూత్న మొక్కు

నవగీతం,పెద్దపల్లి:

జంతువుల పట్ల మానవత్వాన్ని చాటుకుంటూ,తన పెంపుడు కుక్కను కుటుంబ సభ్యుడిలా భావించే శ్రీమాత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కాసర్ల రాజు ఒక అరుదైన మొక్కును తీర్చుకున్నారు.తన పెంపుడు కుక్క భైరవ గత నెలలో తీవ్ర అనారోగ్యానికి గురై,ఆహారం తీసుకోలేక అస్వస్థతకు లోనైన సమయంలో,ఆయన సమ్మక్క-సారక్క వన దేవతలను వేడుకున్నారు.కుక్క ఆరోగ్యం కుదుటపడితే జాతర సమయంలో దాని బరువుకు సమానమైన నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తానని మొక్కుకున్నారు.మొక్కుకున్న కొద్ది రోజుల్లోనే భైరవ కోలుకోవడంతో,ఆదివారం పెద్దపల్లి పట్టణంలో కాసర్ల రాజు తన మొక్కును నెరవేర్చుకున్నారు.కుక్క నిలువెత్తు బరువుకు సమానమైన బెల్లాన్ని తూచి దేవతలకు సమర్పించి కృతజ్ఞత చాటుకున్నారు.ఒక మూగజీవి పట్ల ఆయన చూపిన ఈ ప్రేమను చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ మాత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎంఓ కోట మల్లేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు బొడ్డు సుమన్, బొడ్డుపల్లి రవి,బండ రాజయ్య, కొమరిశెట్టి శ్రీనివాస్, ఓరుగంటి శ్రీధర్,సురేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.