నవగీతం, మెట్ పల్లి
పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి రూ.8 లక్షల 30వేల గల చెక్కులను సుజిత్ రావు నివాసంలో మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మెట్టుపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా, పాతధాంరాజ్ పల్లి ఉప సర్పంచ్ ఇప్పపల్లి గణేశ్, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి అందే మారుతి,జిల్లా కిసాన్ సేల్ ఉప అధ్యక్షులు దామెర రాజశేఖర్ రెడ్డి,ఎండి జాఫర్,బైండ్ల శ్రీకాంత్,మొగిలి రాజేందర్,రాకేష్ సీఎం సహాయనిధి లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.