టిపిసిసి డెలిగేట్ సుజిత్ రావు
నవగీతం,మెట్ పల్లి
పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి కి సంబంధించిన రూ. 8 లక్షల 15వేల గల చెక్కులను శుక్రవారం వారి నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుం టుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా అందజేయడం జరుగుతుందని అని అన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు కోడిమ్యాల దీపక్ రాజ్,మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల రాజు,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్, మాజీ ఉప సర్పంచ్ ఎన్నెడ్ల రాములు,కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్, పొన్నం భూమనందం,బైండ్ల శ్రీకాంత్,బద్దం అంజి రెడ్డి,ఏలేటి వినోద్,పిట్టల వెంకటేష్, పరశురామ్, మొగిలి రాజేందర్ సీఎం సహాయనిధి లబ్దిదారులు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.