ప్రకృతిని పూజించడమే నిజమైన సంక్రాంతి పండగ
నవగీతం,కొడిమ్యాల కొడిమ్యాల మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తల ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశోక్‌రావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాధాన్యతను వివరించారు. సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారని తెలిపారు. ఈ రోజు నుంచి రాత్రి సమయం తగ్గి పగటి కాలం పెరుగుతుందని, ఇది వెలుగుకు, చైతన్యానికి ప్రతీకగా భావించాలన్నారు.మన పెద్దలు పండుగలను కేవలం సంబరాలకే...