navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 12:48 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి..

వ్యవసాయ అధికారి లావణ్య

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలంలోని గుండంపల్లి ,రామదాసపేట్ మొగిలిపేట్ ,దామరాజ్పల్లి , గ్రామాలలో రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించడం జరిగింది. వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి పౌరునికి ఆధార్ కార్డుతో గుర్తింపు ఇచ్చి 14 నంబర్లతో విశిష్ట సంఖ్య ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భూమి ఉన్న ప్రతి రైతులకు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరములతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ఫార్మర్ ఐడి కేటాయించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఈ ఫార్మర్ ఐడి అనుసంధానం చేయబడుతుంది. కావున పీఎం కిసాన్ లబ్ధిదారులు తర్వాత వచ్చే విడత పొందాలంటే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.ఫార్మర్ రిజిస్ట్రేషన్ కావలసినవి. రైతులు ఆధార్ కార్డు పట్టాదార్ పాస్ పుస్తకం ఆధార్ తో లింకు చేయబడిన ఫోను తీసుకొని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మీసేవ వద్ద చేయించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వంశీ సంధ్య వినీత వైష్ణవి పంచాయతీ సెక్రెటరీ నారాయణ ఉప సర్పంచ్ జగ్గుల గంగాధర్ రైతులు రమేష్ జంబుక భూమేష్ ,గుర్రపు చిన్న గంగారెడ్డి ఎర్రంశెట్టి సతీష్, వంగ రాజారెడ్డి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.