navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 7:25 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన వార్డు ఇంచార్జీ

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణంలోని 15వ వార్డులో జరిగిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులను శనివారం వార్డు బీజేపీ ఇంచార్జీ అరిగెల రాకేష్ పర్యవేక్షించారు. గత కొన్ని రోజులుగా 15వ వార్డులో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని గుర్తించిన వార్డు బీజేపీ ఇంచార్జీ అరిగెల రాకేష్ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది వచ్చి ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులను చేపట్టారు. మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించారు. వార్డులో పలు కాలనీల్లో రోడ్డుపై పడి ఉన్న బండరాళ్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాగా పారిశుద్ధ్య పనుల నిర్వహణకు సహకరించి సమస్య పరిష్కారానికి కృషిచేసిన వార్డు బీజేపీ ఇంచార్జీ అరిగెల రాకేష్, మున్సిపల్ సిబ్బందికి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగుల రంజిత్, కురుమశెట్టి జనార్దన్, దడివె నితిన్, ప్రజలు పాల్గొన్నారు.