navageetam.com
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 1:24 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రభుత్వ కళాశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి

జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి బి.నారాయణ.

నవగీతం, జగిత్యాల

జగిత్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బొప్పరాతి నారాయణ అన్నారు. తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్-711 ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మంగళవారం కలెక్టరేట్ భవనంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అధ్యాపకులకు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రతి అధ్యాపకుడు కృషి చేయాలని పేర్కొన్నారు. జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు గురించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో అధ్యాపకులు ముందుండాలని, ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్స్ పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వి. నర్సయ్య, ప్రధాన కార్యదర్శి డా.పి.తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. రాజేషం, సిహెచ్ నర్సయ్య, రాజేందర్, ఎస్. రాజేంద్ర ప్రసాద్, మేఘ శ్యాం, రాజు, లక్ష్మణ్, రామ్ ప్రసాద్, తిరుపతి, రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.