నవగీతం, మెట్ పల్లి
మెట్ పల్లి మండలం మేడిపల్లి గురువారం జడ్పిహెచ్ఎస్ మేడిపల్లి పాఠశాలను బి.రాజేందర్ ఆధ్వర్యంలో ఒక్కో సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ తో పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రార్థన సమయానికి చేరుకొని, ఒక్కో పీరియడ్ లో ఏ సబ్జెక్టు టీచర్ ఏ తరగతి కి పాఠం చెబుతున్నాడో ఆ సబ్జెక్టు టీచర్ తో గదిలోకి వెళ్లి పాఠం విని విద్యార్థులను కూడా చదివించడం, రాసిన నోటు పుస్తకాలను కూడా చెక్ చేయడం జరిగింది. అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నోడల్ అధికారి, వచ్చిన సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ వారు పరిశీలన అంశాలను వివరించారు. పదవ తరగతిలో వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆరు నుండి 9 తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకొని వారిని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.పాఠశాల చక్కని వాతావరణం లో కొనసాగుతుందని టీం మొత్తం సంతృప్తిని చెందారు. ఈ టీంలో బి.రాజేందర్ తో తెలుగు మనోహర చారి, హిందీ జి.రాజేంద్ర ప్రసాద్, ఆంగ్లమ్ పి.ధర్మదీప్, గణితం ఆజాద్ అక్బర్, ఫిజిక్స్ అబ్దుల్ భారీ, జీవశాస్త్రం బి.గంగాధర్, సాంఘిక మ్యాన శ్రీనివాస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సిహెచ్ నాగమణి, ఉపాధ్యాయులు శ్రీదేవి,పద్మలత, నాగన్న, జ్యోతి, భీమన్న,లక్ష్మి, సొప్పరి శ్రీనివాసులు పాల్గొన్నారు.