navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 1:40 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్సీ

నవగీతం,జగిత్యాల:

జగిత్యాల టి యూ డబ్ల్యూ జె ఐ (ఐ జె యూ) ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ వారి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి ని,ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిధర్ ని కార్యవర్గ సభ్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ ఎల్. రమణ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా అని సమాజంలో ఉన్న ప్రజా సమస్యలను పత్రికల ద్వారా తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు దావ సురేష్, అయిల్నేని సాగర్ రావు, వొళ్ళాల గంగాధర్, శీలం ప్రవీణ్,దయ్యాల మల్లారెడ్డి, పడిగేల గంగారెడ్డి, కుడిక్యాల సర్వేశ్వర్, గంగిపెల్లి శేఖర్, గంగిపెల్లి వేణుమాధవ్, కృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.