navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 6:08 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

బంగారం తో(బెల్లం) తులాభారం సమర్పించిన ఎమ్మెల్యే

నవగీతం,జగిత్యాల:

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామివారిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహేంద్ర బాబు జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ 2023లో గెలుపొందాలని వెంకటేశ్వర స్వామి వారిని మొక్కుకోగా ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ నిలువెత్తు బెల్లం తులాభారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ మండల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.