navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 12:30 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

బహుజన రాజ్య స్థాపనతోనే అణగారిన వర్గాలకు న్యాయం

జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజనర్సయ్య

బహుజనుల గోస కరపత్రం ఆవిష్కరణ

నవగీతం,పెద్దపల్లి:

స్వతంత్ర భారతంలో 78 ఏళ్లు గడుస్తున్నా బహుజనుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని,వారి సమస్యలను ఎలుగెత్తి చాటేందుకే బీఎస్పీ పోరాడుతుందని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజనర్సయ్య పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు 78 ఏళ్ల బహుజనుల గోస కరపత్రాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజనర్సయ్య మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ ఎన్నికల కోసం బహుజన్ సమాజ్ పార్టీ సమరోత్సాహంతో సిద్ధంగా ఉందని ప్రకటించారు.జిల్లాలోని అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతున్నామని,ప్రజలు ఏనుగు గుర్తుకు ఓటు వేసి బహుజన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ వరికిల్ల మల్లేష్,ఇంచార్జ్ పేగ నరేష్,జిల్లా ఉపాధ్యక్షులు నర్ల గోపాల్ యాదవ్,జిల్లా ఈ.సి.సభ్యులు బొంకురి రమేష్,జిల్లా మహిళా కన్వీనర్ కాంపెల్లి అనిత,పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బోంకురి దుర్గయ్య,రామగుండం అధ్యక్షులు జనగామ లింగయ్య,ఇంచార్జ్ జింక ఉదయ్,ప్రధాన కార్యదర్శి సాతురి అనిల్,పట్టణ అధ్యక్షురాలు రామిళ్ళ శారద తదితరులు పాల్గొన్నారు.