నవగీతం,కోరుట్ల
కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ 7వ వార్డుకు చెందిన ఆర్ ఏం పి వైద్యులు సుధాకర్ ఆయన అనుచరులతో అలాగే 24వ వార్డుకు చెందిన నీలి శ్రీనివాస్ సహా 30 మంది యువకులు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తామని తెలిపారు.