కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల
నవగీతం,మెట్ పల్లి
మెట్‌పల్లి పట్టణానికి చెందిన బీజేపీ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తోట ప్రసాద్ – సుమలత తమ అనుచరులతో కలిసి సుమారు 80 మందితో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు.కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి చెందిందో, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ఈ సందర్భంగా గుర్తు చేశారు.ప్రస్తుత తెలంగాణ పరిస్థితిని అప్పటి తెలంగాణతో పోల్చి వివరిస్తూ, రాష్ట్రాభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీనే సరైన ప్రత్యామ్నాయమని తెలిపారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలు, ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.