నవగీతం,రుద్రంగి
బీఆర్ఎస్ హయాంలోనే బండ మీది బడి అభివృద్ది జరిగందని, దీనిని ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ అభివృద్ది చేసాడని కాంగ్రెస్ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ను కాంగ్రెస్ నాయకులు గత రెండు రోజుల క్రితం సందర్శించి పాఠశాలను ఎమ్మెల్యే అభివృద్ది చేసాడని కాంగ్రెస్ నాయకుల చెప్పడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించి వారి మాాటలను తిప్పికొట్టారు. గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ది చేయడం మరిచారని, బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవతో మన ఊరు.. మన బడి కార్యక్రమంలో విద్యార్థుల భోజన సౌకర్యార్థం డైనింగ్ హాల్, రెండు అదనపు తరగతి గదులు నిర్మించారని గుర్తు చేసారు. సేవ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సైకిల్ స్టాండ్, కిచెన్ షెడ్డు నిర్మించమని, దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో అదనపు కిచెన్ షెడ్డు, టాయిలెట్స్, సభ వేదిక నిర్మించారని అన్నారు. బడి ఆవరణలో బండ కనపడకుండా ఉండడానికి ఈజీఎస్ నిధులతో మట్టి పోసి దానిని చదును చేసి క్రీడా ప్రాంగణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. దీనికి తామే చేసామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ట్రైబల్ వెల్ఫేర్ నిధులను మళ్ళించి కొచ్చగుట్ట తండా రోడ్డును తమ స్వార్థ రాజకీయాల కోసం గ్ర్రామంలో రోడ్డు వేసారన్నారు. ఇకనైన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ చేసిన అభివృద్దిని తామే చేసామని చెప్పుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మంచే రాజేశం, మాడిశెట్టి ఆనందం, దయ్యాల రాణి, కంటే రెడ్డి, ఆకుల గంగారాం, గెంటే ప్రశాంత్, దయ్యాల పెద్దులు, ఎల్లాల గంగారెడ్డి, సింగారపు గంగరాజం, అంబాటి రాములు, ఈర్ణం రాజేశం, కదాసు లక్ష్మణ్,మ్యాకాల రాజేందర్, శ్రీధర్,ఎండి బాబా, ఏకిలిపురం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.