నవగీతం,జగిత్యాల:
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగస్ శ్రావణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు శ్రావణి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల బిజెపి అధ్యక్షులు విజయ్ కుమార్, పైడిమడుగు సర్పంచ్ బడుగు భూమేష్, వార్డ్ మెంబర్ ఆకువత్తిని నిరంజన్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రావు, గంగారెడ్డి, సత్య గౌడ్, భోగ నవీన్, దోమటి నారాయణ, ప్రభాకర్, మనోజ్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.