నవగీతం,కోరుట్ల
వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం కోరుట్ల పట్టణంలో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు ఆవిష్కరించారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఈ నెల 30న జరిగే శ్రీ లక్ష్మి నృసింహస్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 1 వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు పేట గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు బైన ప్రశాంత్, పెనుకుల అశోక్, నాయకులు రుద్ర శ్రీనివాస్, చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, ఏలేటి నరేందర్ రెడ్డి, పెండెం గణేష్, ధనుంజయ్, మాడలేని నరేష్, పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.