navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 11:36 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

భక్తునికి భగవంతునికి మధ్య వారిదిగా ఉండేది ఆలయ అర్చకులు.

అర్చకులపై కొండగట్టు ఈవో  అమర్యాదగా ప్రవర్తించడం సరికాదు

భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు

నవగీతం,జగిత్యాల :

భారత్ సురక్ష సమితి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు సామాజిక సమరసతా వేదిక జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్ సురక్ష సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది అక్కినపల్లి కాశీనాథం మాట్లాడుతూ హిందూ మతానికి మూల స్తంభాలుగా, భక్తునికి భగవంతునికి మధ్య వారిదిగా ఉండి ఆలయ సాంప్రదాయాలను కాపాడే అర్చకులపై కొండగట్టు ఈవో శ్రీకాంత్ రావు అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని,తాను ఒక ప్రభుత్వ ఉద్యోగినని మరిచిపోయి గత రెండు మూడు నెలలుగా అర్చకులను మిగతా ఆలయ సిబ్బందిని కూడా దూషిస్తూ మానసికంగా వేధిస్తూ ఒక నియంత లాగా వ్యవహరిస్తున్నాడని, ప్రశాంతమైన వాతావరణంలో దైవదర్శనాన్ని కల్పించే అర్చకులు ఇలాంటి చర్యల వల్ల మానసిక ఇబ్బందులకు గురైతే అది సామాన్య భక్తుల మీద కూడా ప్రభావం పడుతుందని అన్నారు. హిందూ ధర్మంలో ఆలయంలో ఉండే భగవంతుని ఏ విధంగా పూజిస్తామో అదేవిధంగా అర్చకులు పూజారులను కూడా దైవ స్వరూపాలుగానే భావిస్తారని అలాంటి వీరి పట్ల ఆ మర్యాదగా ప్రవర్తించడం అంటే హిందువుల భక్తుల మనోభావాలను కించపరచడమేనని కాబట్టి ఈఓ ను తక్షణమే విధుల నుంచి తొలగించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్ ఉపాధ్యక్షుడు వేముల పోచమల్లు కొత్తకొండ బాలన్న కె ఆర్ కృష్ణ నరేందుల శ్రీనివాస్ సిరిపురం గంగారం బాసెట్టి దుబ్బరాజం తదితరులు పాల్గొన్నారు