మట్టి పాటల మాణిక్యాలకు ఘన సన్మానం

నవగీతం, జగిత్యాల మన మట్టి వాసనను, జానపద సంస్కృతిని తమ పాటల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తూ, గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామానికి చెందిన నక్క లక్ష్మిలు నక్క గంగవ్వలను గ్రామ సర్పంచ్ పోన్ శెట్టి మహేష్ ఘనంగా సన్మానించారు. వారి ప్రతిభను గుర్తించిన సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఫోన్ శెట్టి మహేష్  మాట్లాడుతూ అంతరించిపోతున్న జానపద కళలను కాపాడుతూ, మన సంస్కృతిని భావి తరాలకు...