navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 10:43 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మాజీ సర్పంచ్ నిమ్మల రాములు అకాల మరణం

నవగీతం, మల్లాపూర్

వేంపల్లి గ్రామానికి చెందిన నిమ్మల రాములు (70) అనారోగ్యంతో మృతి చెందారు.తెలుగుదేశం పార్టీ ఎన్ టి రామారావు హయాంలో చురుకైన టిడిపి కార్యకర్తగా పనిచేశారు. చంద్రబాబు మీకోసం పాదయాత్ర లో మల్లాపూర్ మండలంలో సామాన్య కార్యకర్తగా టిడిపి పార్టీకి ఎనలేని కృషి చేశారు.ఆయన మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతి పట్ల సర్పంచ్ ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు