మార్షల్ ఆర్ట్స్ లో మీ విజయం స్ఫూర్తిదాయకం
దశాబ్దాల సాధనతో యువతరానికి అద్భుత సందేశం ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ నవగీతం,హైదరాబాద్ జపనీస్ కత్తి సాము కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు సందేశాన్ని పంపారు. “జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీరు సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాను. కెంజుట్సు లో అధికారిక ప్రవేశంతో ఘనత సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇటు...