navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 12:08 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మున్సిపల్ లో బీజేపీ జెండా ఎగరాలి

– బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు

నవగీతం, మెట్ పల్లి

మేట్ పల్లి పట్టణం బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల సన్నహాక సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో సుమారుగా 49 శాతానికి పైగా బీజేపీ ఓటు బ్యాంకు పెరగడం శుభ పరిణామం అన్నారు. వార్డుల్లో పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చినా అభ్యర్థిని గెలిపించుకోవడానికి సాయశక్తుల కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు,అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మీ, జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సుంకేట విజయ్, కుడుకల రఘు, అన్ని వార్డుల బీజేపీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.