నవగీతం,ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన గడ్డం సింహాద్రి తండ్రి గడ్డం పరశురాములు మంగళవారం రోజున మృతిచెందగా స్థానిక సర్పంచ్ మామిడి రాజు మృతుడు కుటుంబాన్ని పరామర్శించి తనవంతుగా అంత్యక్రియల కోసం రూ.10000 వేలు మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. విరితో వార్డు సభ్యులు మామిడి శ్రీనివాస్, రాకం సుమన్ ,అంతటి శ్రీకాంత్ , నాయకులు కొట్టే వెంకన్న, అశోక్ ,తిరుపతి, శ్రీను ,ధనుంజయ్, మురళి తదితరులు పాల్గొన్నారు.