navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 12:13 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మృతుల కుటుంబాలను పరామర్శించిన పంచాయతీ పాలకవర్గం..

ఇంటికి వెళ్లి మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేత.

నవగీతం,మల్లాపూర్

మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను గ్రామ సర్పంచ్ గోల్కొండ కళా రమేష్ , ఉప సర్పంచ్ ధండవేని రాజేందర్ లు పరమర్శించారు.ఈ సందర్భంగా వారు సానుభూతి తెలుపుతూ కష్ట సమయంలో గ్రామ పంచాయతీ పూర్తిగా అండగా ఉంటుందని, వితంతువుల పింఛన్ త్వరగా మంజూరు చేయడంలో పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.అలాగే అధికారికంగా మరణ ధ్రువపత్రాలు ఇంటికి వెళ్లి అందజేశారు.విరితో వార్డు సభ్యులు ధండవేని సోమరాజు, పూజారి సైలూ, జంగా ప్రణయ్, గొల్లవతిని విజయ్ గ్రామ పంచాయతీ సిబ్బంది గోల్కొండ పవన్ తదితరులు ఉన్నారు.