navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 10:48 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండవు : ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ లు తీసుకునే విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండవని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే వేంకయ్య ప్రకటించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం రోజున బడి – బాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.సంజీవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య మాట్లాడుతూ, దోస్త్ ద్వారా కళాశాలలో అడ్మిషన్ లు జరుగుతాయని,ఆ సమయంలో విద్యార్థులకు మొదటి దశలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో సుమారు 200 రూపాయలను ప్రభుత్వానికి చెల్లించ వలసి ఉంటుందని, రెండవ దశలో మాత్రం సుమారు 400 రూపాయలు చెల్లించ వలసి ఉంటుందని అన్నారు. అందువల్ల మొదటి దశలోనే విద్యార్థులు అధిక సంఖ్యలో చేరాలని హితవు పలికారు.ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలను తామే భరిస్తామని స్పష్టం చేశారు.పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య ప్రకటించారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న మాట్లాడుతూ, విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి, పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తామని అన్నారు. అనంతరం కళాశాల అకాడమిక్ కో – ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కళాశాల కామర్స్ హెచ్. ఓ .డి. ఏ.మనోజ్ కుమార్ తో పాటు లెక్చరర్లు అంజయ్య, శ్రీకాంత్ తదితరులు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు మధు, సంతోష్, రికార్డు అసిస్టెంట్ శ్రీనివాస్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరపత్రాన్ని బోధన, బోధనేతర సిబ్బంది ఆవిష్కరించారు.