navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 2:53 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మేడారం జాతర తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలి..

బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

నవగీతం, కరీంనగర్

కరీంనగర్ లొని  బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని బిసి సంక్షేమ సంఘం పక్షాన కోరడం జరిగింది. ఈనెల చివరన ఆసియాలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ లోని చాలా ప్రాంతాల ప్రజలు భక్తి శ్రద్ధల మధ్య ఈ పండుగను నిర్వహించుకుంటారు ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారుతుంది ప్రభుత్వం ఈ సమ్మక్క సారక్క జాతరను గుర్తుంచుకొని ఎన్నికలను వాయిదాల వేయాలని భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రభుత్వం జాతర ఏర్పాట్లలో నిమగ్నమవడం వల్ల ఎన్నికలు కూడా నిర్వహించడం ఇబ్బంది కరంగా అవుతుంది వీటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో వాయిదా వేయాలని భక్తుల మనోభావాలను గౌరవించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ , బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి , బోయిని ప్రశాంత్ , రవి గౌడ్ , సతీష్ తో పాటు బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోవడం జరిగింది