navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 3:51 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ సిబ్బందితో సమీక్ష

నవగీతం మెట్ పల్లి

మేడారం జాతర సందర్భంగా మెట్ పల్లి డిపోలో కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది మేడారం జాతర సందర్భంగా సేవా భావంతో పనిచేయాలని సూచించారు
జాతరకు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించి జాతర విధులలో పాల్గొనే సిబ్బందికి కావలసిన ఏర్పాట్లు వారికి కల్పించే సౌకర్యాలు గురించి వివరించారు. జాతర సందర్భంలో ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా ఒకే లైన్లో వెళ్లడం ఎంతో ముఖ్యమని డ్రైవర్లందరూ క్రమశిక్షణతో బస్సులు నడపాలని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ భూపతి రెడ్డి డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్), మల్లేశం డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) డిపో మేనేజర్, ట్రాఫిక్ సూపర్వైజర్లు కండక్టర్లు, డ్రైవర్లు, ఆఫీస్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.