మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువు పైన దృష్టి పెట్టాలి.  ఎమ్మెల్యే సంజయ్

నవగీతం, మెట్ పల్లి మెట్‌పల్లి మండలం బండలింగాపూర్, రాజేశ్వర్ రావుపేట జిల్లా పరిషత్ హై స్కూల్స్ ను మెట్‌పల్లి లోని నరేంద్ర జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రెండు మూడు నెలల్లో పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, పూర్తిగా చదువుపై దృష్టి సారించాలని సూచించారు.భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమేనని, చైనా, అమెరికా వంటి దేశాలు విద్యా–సాంకేతిక రంగాల్లో వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు.అలాంటి దేశాలతో పోటీ...