నవగీతం,రుద్రంగి
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల యాదవ యూత్ సంఘ సభ్యులు ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సుడుగేపు పర్షరాములు, ఉపాధ్యక్షుడిగా గెంటే ప్రశాంత్, ప్రదాన కార్యదర్శిగా ధర్నా గంగమల్లయ్య (చింటు), కోశాధికారిగా ముచ్చర్ల శేఖర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భముగా నూతన అధ్యక్షుడు సుడిగేపు పర్షరాములు మాట్లాడుతూ.. యాదవ యువకులు రాజకీయంగా ఎదగాలని, యూత్ అభివృద్దిని చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. నాపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు యూత్ సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.