నవగీతం,మాల్లాపూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలలో మల్లాపూర్ మండల చిట్టాపూర్ గ్రామంలో ఓంకార్ సామ్రాట్ అనే యువకుడు కొలువు సాధించారు. ఈ సందర్భంగా వారికి గ్రామపంచాయతీ పాలకవర్గం తరపున సర్పంచ్ సంపతి శంకరమ్మ ఆశాలు,ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్ శాలువాలతో సన్మానించారు.సర్పంచ్ శంకరమ్మ మాట్లాడుతూ యువత ఇంకా ప్రభుత్వ కొలువులు సాధించాలని ఆకాంక్షించారు.ఇట్టి కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఇట్టేడి శంకర్, రామగిరి సంజీవ్, మట్ట రాములు, ఎలాల రేణుక,పబ్బతి జ్యోతి, ఉప్పులూటి. లక్ష్మి నారాయణ, పబ్బతి రాజేష్, కార్యదర్శి అశోక్, కరోబార్ సత్యనారాయణ,మాజీ సర్పంచ్ సాయి, శ్రీనివాస్,భూమేష్ తదితరులు పాల్గొన్నారు.