navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 7:52 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

యువజన సంఘాల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి

నవగీతం,కథలాపూర్

కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో సోమవారం రోజున యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన యోగి అని,తన ఉపన్యాసాల ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన మహనీయుడని కొనియాడారు. పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన తొలి హిందూ ఆధ్యాత్మికవేత్త కావడం విశేషమని తెలిపారు.ఇనుప కండరాలు, ఉక్కునరాలు, వజ్రసంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అని వారు దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన పుట్టినరోజును “జాతీయ యువజన దినోత్సవం”గా జరుపుతున్నదని కీర్తించారు. ఈ కార్యక్రమంలో గాంధారి శ్రీనివాస్,నీలి శ్రీనివాస్,మల్యాల మారుతి, కాసోజి ప్రతాప్,నాంపల్లి శ్రీధర్, సిరిమల్లె రాజశేఖర్, మారంపల్లి నారాయణ, శ్రీధర్, మంచాల మధుసూధన్, రఘు,నిమ్మ రూపేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.