navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 2:22 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుకు రావాలి:ఎమ్మెల్యే సంజయ్

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన యం పి ఎల్-4 క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్‌లో పోటీపడి విజయం సాధించిన విన్నర్ టీమ్, అలాగే ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచిన రన్నర్-అప్ టీమ్‌లకు ఎమ్మెల్యే సంజయ్ బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని, ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని పేర్కొంటూ, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుకు రావాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, రాఘవపేట్ సర్పంచ్ తోట శ్రీనివాస్,దేవా మల్లయ్య, బిట్ల నరేష్, దశ రెడ్డి,  మల్లేష్ యాదవ్ ,సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,మహమ్మద్ రఫీ,ముద్దం శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, యువకులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.