నవగీతం,జగిత్యాల
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామ పరిధిలో ఫార్మర్స్ బ్రిడ్జ్ వ్యవస్థాపకుడు ఎగుర్ల గణేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని క్యారం బోర్డ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగుర్ల గణేష్ మాట్లాడుతూ గ్రామంలోని యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడలు ఎంతో దోహదపడతాయని,అలాగే గ్రామంలో క్రీడల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ క్యారం బోర్డ్ టోర్నమెంట్‌లో గ్రామానికి చెందిన యువకులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ సంతోష్, మాజీ ఉప సర్పంచ్ లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ అశోక్, అనుమల్లా అజయ్‌లు ప్రారంభించారు. టోర్నమెంట్‌లో మొదటి బహుమతిని జగదీష్, పవన్‌లు గెలుచుకోగా, రెండో బహుమతిని గుర్రం కిషన్, నవీన్‌లు సాధించారు. విజేతలకు మాజీ ఉప సర్పంచ్ లింగారెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ, గ్రామ యువత కోసం ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించిన ఎగుర్ల గణేష్‌ను అభినందించారు.