నవగీతం,మల్లాపూర్:
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ లో ప్రోపరేటర్ సుద్దాల మానస – కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రోపరేటర్ మానస జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తోట శ్రీనివాస్, ఉప సర్పంచ్ మద్దెల నరసయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గం,వివిధ పార్టీల నాయకులు, మిత్రులు, యువకులు,కస్టమర్లు, గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుద్దాల కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణకు వచ్చిన మిత్రులకు, నాయకులకు శ్రేయోభిలాషులకు, కష్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు.