రన్నరప్‌గా నిలిచిన జిల్లా జట్టు
నవగీతం,పెద్డపల్లి:
నారాయణపేట జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖో-ఖో టోర్నమెంట్‌లో పెద్దపల్లి జిల్లా జట్టు చారిత్రక విజయం సాధించి రాష్ట్రస్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టుపై ఘనవిజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్న పెద్దపల్లి, ఆదిలాబాద్ జట్టుతో జరిగిన హోరాహోరీ పోరులో పోటాపోటీగా ఆడి రన్నరప్‌గా నిలిచింది. జిల్లాలో నూతన అసోసియేషన్ ఏర్పాటైన ఏడాది తిరగకముందే,సీనియర్స్ రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఇప్పుడు సబ్ జూనియర్స్‌లో రెండో స్థానం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.జిల్లా జట్టు సాధించిన ఈ అద్భుత విజయంపై ఖో-ఖో సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు టి.లక్ష్మయ్య,డాక్టర్ వేల్పుల కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో జిల్లా మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ విజయం పట్ల సంఘం జాయింట్ సెక్రటరీ మరియు పీఈటీ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ వేల్పుల సురేందర్,ఉపాధ్యక్షులు డాక్టర్ భూపెల్లి నారాయణ, ప్రసాద్,షఫీ, సంధ్యారాణి,రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ కిష్టయ్య,కోచ్ గణేష్ తదితరులు క్రీడాకారులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.