నవగీతం, మెట్ పల్లి
మెట్ పల్లి మండలం వేంపేట్ గ్రామంలో రెడ్డీస్ కుల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గం అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సంఘసభ్యులు ఆకాంక్షించారు. సర్పంచ్ మాట్లాడుతూ గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నిస్పక్షపాతంగా గ్రామభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు