నవగీతం,మెట్ పల్లి
మెట్ పల్లి మండలం ఆరపేట గ్రామనికి చెందిన రైతు బొజ్జ దేవయ్య అనారోగ్యంతో గత20 రోజుల క్రితం చనిపోవడంతో వారికి రైతు బీమా ద్వారా మంజూరు అయిన రూ.5 లక్షల చెక్కును ఆయన కుమారుడు బొజ్జ అనిల్ కు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సింగారావు అందజేశారు. అనంతరం జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ తో పాటు,ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుందని అత్యధికంగా దేశంలోనే తెలంగాణ లో ప్రథమ స్థాయిలో పంటలు పండిస్తున్నారని రైతులను ఆదుకోవాలని రైతులకు బీమా ద్వారా అండగా నిలుస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం మండలాధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి మాజీ కో ఆప్షన్ పన్నాల మాధవరెడ్డి అబ్దుల్ షకీల్ ధ్యావన పెళ్లి రాజారాం తదితరులు పాల్గొన్నారు