రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ నవగీతం,తంగళ్ళపల్లి, వైద్యారోగ్య శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు అన్ని వ్యాధులపై అవగాహన కల్పించాలని, ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్లు, ఎన్.సీ.డీ స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీ.హెచ్.సీ)ని ఇంచార్జి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఇమ్యూనైజేషన్ గది, ఇన్ పేషెంట్ గదులు,ఇతర గదులు, ఆవరణలో పరిశీలించారు.ఆరోగ్య కేంద్రంలో ఉన్న...