రోడ్డు భద్రతే జీవన రక్షణ – విద్యార్థులే మార్పుకు దూతలు
నవగీతం, జగిత్యాల జగిత్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాస వారోత్సవాలలో భాగంగా, శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ (డీటీఓ) అధికారి శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి కీలక భద్రతా సందేశం అందించారు.ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో, విద్యార్థులు కూడా ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఆందోళనకరమని తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, రోడ్డు దాటేటప్పుడు నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగం...