-సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
నవగీతం, మెటపల్లి
రోడ్డు భద్రత అనేది సమాజం లోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మంగళవారం ఆయన మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రోడ్డు సురక్ష అభియాన్ 2026 కార్యాచరణ కి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా న్యాయవాదులు కూడా ప్రజల్ని చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్, ఏపీపి జి. ప్రణయ్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్ న్యాయవాదులతో కలసి కోర్టు ఆవరణలో పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజేల్లి రామ్ దాస్, లోక్ అదాలత్ సభ్యులు వడ్డేపల్లి శ్రీనివాసన్, జేడి సుధాకర్, మీడియాషన్ కో ఆర్డినేటర్లు ఒజ్జెల శ్రీనివాస్, బక్కూరి రమేష్,మహిళా న్యాయవాదులు కాజీపేట స్రవంతి, ఒజ్జెల శ్రీలేఖ, లొకిని హరి చందన మరియు బార్ సభ్యులు పాల్గొన్నారు.