navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 10:35 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  పిల్లలకు పుస్తకాలు,పండ్లు పంపిణీ

నవగీతం, మెట్ పల్లి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల
3 నుండి 11 వ తారీకు వరకు హంగర్ రిలీఫ్, ఆకలి నివారణ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా 5వ రోజు బుధవారం న్యూట్రిషన్ డే సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో ఏకలవ్య నగర్ లో 50మంది స్కూల్ పిల్లలకు బుక్స్ అండ్ పండ్లు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి లైన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాసరావు కోశాధికారి వేములవాడ చంద్రశేఖర్, ఇల్లెందుల శ్రీనివాస్. స్పాన్సర్ బొమ్మెల శంకర్, మర్రి భాస్కర్, ఆల్ రౌండర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు