డాక్టర్ కాపమురళీకృష్ణ
నవగీతం,వైరా
వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా సమాజంలో అత్యంత నిరుపేదలకు ఆర్థిక సహాయంతో పాటు ఎన్నో సేవలు అందించామని ఫాస్ట్ జిల్లా గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ వివరించారు. వైరా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వై బుచ్చి రామారావు ఆధ్వర్యంలో వైరాకు చెందిన కేశవ రాణి కి బుధవారం సాయిబాబా మందిరంలో రాయితీతో కూడిన కుట్టు మిషన్ ను అందించారు ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ సమాజసేవే పరమావధిగా లయన్స్ క్లబ్ నుండి ఎంతో మందిని ఆదుకున్నామని పేదలను నిరుపేదలను విద్యార్థులను వృద్ధులను చేయూతనందించాము. పేద వర్గాలు లేని సమాజం చూడటమే లయన్స్ క్లబ్ ధ్యేయమని అని అన్నారు. 17 సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు పైచదువుల నిమిత్తం ఆర్థికంగా కూడా ఆదుకున్నామని క్లబ్ ద్వారా చదువులో రాణించి ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రీజియన్ సెక్రటరీ పెనుగొండ ఉపేందర్ రావ్ క్లబ్ సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరావు ఎల్ సి ఎఫ్ కోఆర్డినేటర్ చింతలపూడి వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ మహిళా కోఆర్డినేటర్ మాదినేని సునీత తదితరులు పాల్గొన్నారు.