navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 6:37 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వాడ వాడల రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

నవగీతం,రుద్రంగి:

77వ గణతంత్ర దినోత్సవం సందర్భముగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో వాడవాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మోతీరాం, తాహాసీల్ధార్ కార్యాలయంలో ఎంఆర్వో పుష్పలత, ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈవో రామకృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడీవో నటరాజ్, రైతు వేదిక ఆవరణలో ఏవో ప్రియదర్శిని, ప్రభుత్వ పాఠశాలలో ప్రదానోపధ్యాయులు సమ్మిరెడ్డి, సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏఎంసీ చెర్మెన్ చెలుకల తిరుపతి, గ్రామపంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ గండి నారాయణ, బీఆర్ఎస్ పార్టీ జెండా వద్ద గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ వద్ద క్లబ్ అధ్యక్షుడు గసికంటి రాజు, ఆదర్శయూత్ సంఘ భవనం వద్ద యూత్ అధ్యక్షుడు నాగులపెల్లి సంతోష్ లు జెండా ఎగురవేసి మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.