15వ వార్డు బీజేపీ ఇంచార్జీ అరిగెల రాకేష్
నవగీతం, మెట్ పల్లి
వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు తనవంతు కృషి ఉంటుందని 15వ వార్డు బీజేపీ ఇంచార్జీ అరిగెల రాకేష్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పట్టణంలోని 15వ వార్డులో గల మార్కండేయ దేవాలయం వద్ద డ్రైనేజీ ప్రమాదకరంగా ఉండడంతో స్పందించిన 15వ వార్డు బీజేపీ ఇంచార్జీ అరిగెల రాకేష్ ఆ మురికి కాలువ పైన ప్రత్యేకంగా సిమెంట్ పైకప్పులను ఏర్పాటు చేయించారు. గత కొన్ని రోజులుగా అక్కడ మురికి కాలువ ప్రమాదకరంగా ఉండడంతో వాహన చోదకులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆయన గుర్తించారు. ప్రజలకు సదరు మురికి కాలువ ద్వారా ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో తన సొంత నిధులు వెచ్చించి మురికి కాలువ పైన సిమెంటు పైకప్పులను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా వార్డులో వీధి దీపాల సమస్య ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే సమస్యను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాగా గత కొన్ని నెలలుగా ప్రమాదకరంగా ఉన్న మురికి కాలువ పైన సిమెంటు పైకప్పులను 15వ వార్డు బీజేపీ ఇంచార్జీ అరిగెల రాకేష్ ముందుకు వచ్చి ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి ముందుండి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.