navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 1:38 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వాల్ రైటింగ్ రాస్తూ ప్రచారం చేస్తున్న జనసేన అభ్యర్థి

నవగీతం,జగిత్యాల:

పురపాలక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ప్రచారానికి  శ్రీకారం ఉంటుంది బుధవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి పురపాలక పరిధిలో జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఈయన పేరు మ్యాడారపు మారుతి ఇతను గత 20 సంవత్సరాలు నుంచి చిత్రకారుడుగా జీవనం సాగిస్తున్నాడు. నాడు చిరంజీవి పార్టీలో నాయకుడుగా ఎదిగిన వ్యక్తి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున పోటీకి సిద్ధమయ్యాడు. పురపాలక ఎన్నికల్లో పట్టణంలోని 17వ వార్డు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టాడు.

ఆర్టిస్టు అయినా మారుతి తన వార్డులో ఇంటి యజమానుల నుంచి అనుమతి తీసుకొని ఇంటి గోడలకు గ్లాసు గుర్తు వేసి జనసేన చిత్రాలు వేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణమే మొదటగా ప్రచారం ప్రారంభించింది జనసేన పార్టీ ప్రస్తుతం ఈ వార్డులో ఏ వీధిలో చూసినా ప్రజలకు జనసేన గ్లాసు గుర్తు అందరిని ఆకట్టుకుంటుంది.