navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 3:11 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వాసవి డైమండ్ వనిత క్లబ్ ల సేవలను విస్తరిస్తాం

నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలను ఆదుకుంటాం

వనమా విశ్వేశ్వరరావు

నవగీతం, వైరా

వైరా స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి డైమండ్ క్లబ్ ,వాసవి  వనిత క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద  ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన మిట్టపల్లి దామోదర్ అనే వ్యక్తికి అతని జీవనోపాధి కొరకు మోటార్ రిక్షాని అందజేశారు.  అనంతరం వర్తక సంఘం  అధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు డాక్టర్ పేరుమాళ్ళ కృష్ణమూర్తి మాట్లాడుతూ వాసవి డైమండ్ వాసవి వనితా క్లబ్బుల సేవలను సమాజంలో మరింత విస్తృత పరుస్తామని వెల్లడించారు పేద నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలను ఆదుకోవటమే క్లబ్బుల ముఖ్య ఉద్దేశమని వారన్నారు. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని అదే స్ఫూర్తితో నూతన వాసవి క్లబ్బుల అధ్యక్షులు మరింత సేవలకు ముందుకొచ్చి ప్రతి ఒక్క నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలను అండగా నిలవాలని వారి కోరారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ మొదటి ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాసరావు వాసవి డైమండ్ క్లబ్ నూతన  అధ్యక్షులు నంబూరి శ్రీనివాసరావు వాసవి వనిత క్లబ్ నూతన అధ్యక్షురాలు మిట్టపల్లి మహాలక్ష్మి వాసవి వనిత క్లబ్ ప్రధాన కార్యదర్శి రాయల అన్నపూర్ణ కోశాధికారి మిట్టపల్లి సుధారాణి సుగ్గల మాధవి రాయల రోజా వెచ్చ మంగతాయారు మౌనిక ఆర్యవైశ్య మహాసభ వైరా మండల అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కొణతాలపల్లి వెంకట సుజిత్  ఆర్యవైశ్య సంఘ నాయకులు నూకల ప్రసాద్ రావు కొణతాలపల్లి వెంకట సుబ్బారావు మిట్టపల్లి వెంకటరమణ కొల్లా రాంబాబు వజినేపల్లి రవి మిట్టపల్లి జగన్మోహనరావు రంగా సింహాద్రి మిట్టపల్లి నరసింహారావు గజ్జల కృష్ణమూర్తి కొప్పురావూరి శబరినాథ్ గ్రంధి విశ్వేశ్వరరావు ఉడత శ్రీనివాసరావు అవినాష్ గజ్జల భాస్కర్ బోనగిరి సతీష్ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.