navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 12:01 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విజయవంతంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ

నవగీతం, మల్లాపూర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలపై అవగాహన పెంచడంతో పాటు క్రీడల పట్ల ఆదరణ పెంపొందించి వీటి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తున్నాయని తెలియజేస్తూ సీఎం కప్ టార్చ్ ర్యాలీ మల్లాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల దగ్గర ఎంఈఓ దామోదర్ రెడ్డి జెండా ఊపి సియం కప్ టార్చ్ ర్యాలీ ని ప్రారంభించారు.ఈ ర్యాలీ మల్లాపూర్ హైస్కూల్ నుండి ఎంఈఓ కార్యాలయం వరకు విజయవంతంగా సాగింది.ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చంద్ర మోహన్ రెడ్డి, ఏఎస్ఐ,ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి ,కుస్థాపూర్ ఉప సర్పంచ్ సర్కెల మహిపాల్, నాయకులు కోటగిరి ఆనంద్,వార్డు సభ్యులు కోపెల్లి రాకేష్, నత్తి  రాము, గోల్కొండ ప్రవీణ్ తదితర ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.