నవగీతం,మాల్లాపూర్
వసంత పంచమి సందర్భంగా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి దేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించి పిల్లలకు సామూహిక అక్షర అభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులు పరీక్షలను విజయవంతంగా రాయాలని పదో తరగతి పరీక్షలు అంటే భయపడకుండా మంచి ఆలోచనతో పరీక్షలు రాసి ఉత్తీర్ణలు కావాలని కోరారు. అనంతరం పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు, చిన్నపిల్లలకు పలక బలపాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ నరసయ్య ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు