navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 12:52 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.

నవగీతం, కోరుట్ల

కోరుట్ల పట్టణంలోని పి.బి గార్డెన్స్‌లో నిర్వహించిన పి ఆర్ బి ఎం జూనియర్ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పట్టుదలతో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ కష్టపడి చదివిస్తున్నారని ప్రశంసించారు..
అలాగే రానున్న పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ శ్రద్ధగా చదవాలని విద్యార్థులకు సూచించారు.
విద్యతోనే మంచి భవిష్యత్తు సాధ్యమని, సమాజంలో గుర్తింపు పొందేందుకు విద్యే ప్రధాన ఆయుధమని తెలిపారు.
అలాగే రానున్న రోజుల్లో దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ సమావేశంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు